అమరావతిపై మీ స్టాండ్ ఏంటి?: భాష్యం
AP: అమరావతి రాజధానిపై తన స్టాండ్ ఏంటని YCP నేత నంబూరు శంకరరావును పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ నిలదీశారు. అమరావతి-బెల్లంకొండ రోడ్డు, మద్దూరు బ్రిడ్జిని తానే తెచ్చానని నంబూరు చెప్పుకుంటున్నారని.. అలాంటి మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. అసలు నియోజకవర్గం కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఎంత అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు.