డీపీఆర్‌వోగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
SRPT: జిల్లా నూతన పౌర సంబంధాల అధికారిగా వి. శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్, అదనపు కలెక్టర్ కె. సీతారామారావులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.