BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
BHPL: సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేగొండ మండలం, రూపీరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు బుధవారం కాంగ్రెస్ పార్టీ వీడి BRSలో చేరారు. గండ్ర వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువతకు BRS పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు.