VIDEO: 'BRS మద్దతుదారులను గెలిపించండి'
SRD: బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. శనివారం మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించి స్థానిక పార్టీ అభ్యర్థి సులోచన మోహన్‌ను ఓట్లు గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నారు.