శంభునిపేటలో 120 గ్రాముల గంజాయి పట్టివేత
WGL: వరంగల్ శంభునిపేట నాగమయ్య గుడి సమీపంలో మిల్స్ కాలనీ పోలీసులు గురువారం నిర్వహించిన తనిఖీలలో 120 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన జావిద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా గంజాయి లభించినట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.6 వేలుగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.