నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
W.G: విద్యుత్ లైన్లు మరమ్మతులు నిమిత్తం శనివారం తణుకు నియోజకవర్గ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ కే.నరసింహమూర్తి తెలిపారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలతో పాటు తణుకు పట్టణంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నందున వినియోగదారులు సహకరించాలన్నారు.