VIDEO: ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న స్కూలు విద్యార్థులు.!

VIDEO: ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న స్కూలు విద్యార్థులు.!

ప్రకాశం: రాచర్ల నుంచి తమ గ్రామాలకు వెళ్లే పాఠశాల విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో బస్సు ప్రయాణం చేస్తున్నారు. గురువారం సాయంత్రం అన్నంపల్లె, తురిమెళ్ళ వైపు వెళ్లే బస్సుల్లో సీట్లులేక విద్యార్థులు డోర్ వద్ద వేలాడుతూ కనిపించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. RTC అధికారులు తగిన బస్సుల సదుపాయం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.