ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకే కళాజాత: సీఐ

ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకే కళాజాత: సీఐ

WGL: ప్రజలను చైతన్య పరచడానికి, వారితో మమేకం కావడానికి పోలీసుల కళాజాత నిర్వహిస్తున్నామని సీఐ రాజగోపాల్ తెలిపారు. బుధవారం పర్వతగిరి మండలం కల్లెడలో పోలీస్ కళాజాత ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పర్వతగిరి సీఐ విద్యార్థుల ఆత్మహత్యలు, సైబర్‌ నేరాలు, మహిళలపై జరుగుతున్న దాడులు, 100 డయల్‌‌పై అవగాహన కల్పించారు.