ఉపసర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా ప్రవీణ్ యాదవ్

ఉపసర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా ప్రవీణ్ యాదవ్

MBNR: బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్ మొదటి వార్డు సభ్యుడుగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మంగళవారం ప్రవీణ్ యాదవ్‌ను మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా హైదరాబాదులోని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగృహంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.