ఇకపై వారికి భూములను కేటాయించబోం: TTD

ఇకపై వారికి భూములను కేటాయించబోం: TTD

AP: తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలను ఆనుకుని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. APTA నుంచి తీసుకుంటున్న 24.68 ఎకరాలకు బదులుగా TTDకి చెందిన భూమిని ఇవ్వటానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ మేరకు APTAకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు.