'పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి'
KRNL: కౌతాళం మండల ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎంపీడీవో గోపాల్ కోరారు. ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక వసతుల మెరుగు కోసం పన్నుల వసూలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మండలంలో శుభ్రత, రహదారులు, తాగునీటి పనులు వేగవంతం చేయవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.