చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

NLR: చైన్ స్నాచింగ్ ముఠాను మనుబోలు పోలీసులు అరెస్ట్ చేశారు. S.I రాకేశ్ వివరాల మేరకు.. గూడూరుకు చెందిన హేమంత్, కంకి శ్రీహరి, దువ్వూరు మహేశ్, సైదాపురం చాగణం గ్రామానికి చెందిన శివమణి వ్యసనాలకు బానిసలై దొంగతనాలు చేస్తున్నారు. మనుబోలుకు చెందిన రమణమ్మ మెడలోని నగలు అపహరించారు. వీరంపల్లి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అరెస్ట్ చేసి 14 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు.