'ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రత్యేక రాయితీ'

'ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రత్యేక రాయితీ'

PDPL: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఏప్రిల్ 30 లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% రాయితీ ఇస్తున్నట్లు కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పన్ను కౌంటర్లు రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.