'ఉత్తమ ఫలితాల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం'

'ఉత్తమ ఫలితాల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం'

WGL: రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ కవిత సోమవారం మీడియాతో మాట్లాడారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేస్తున్నామని, అధునాతన పద్ధతుల్లో బోధన చేస్తున్న కేజీబీవీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.