సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌ బాబు అన్నారు. ఆదివారం వేమూరు మండలంలోని ఎనిమిది మంది బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5,43,328ల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఆపత్కాలంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.