జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీదేవి

VSP: భీమునిపట్నం మున్సిపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న త్రిమూల శ్రీదేవికి జాతీయ ఉత్తమ ఉపాధ్యయురాలుగా అవార్డు లభించింది. మంగళవారం విశాఖ జిల్లా ఇంఛార్జ్ మంత్రి వీరాంజనేయులు ఆమెకు అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లాకు జాతీయ అవార్డు గర్వకారణమన్నారు. అవార్డుతో శ్రీదేవి సేవలకు తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు.