మూడు రోజులపాటు విద్యుత్ నిలిపివేత

SS: ధర్మవరం పట్టణంలో ఈ నెల 22, 23, 24 తేదీలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో ఏడీ లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. మార్కెట్ యార్డ్ సబ్‌స్టేషన్ వద్ద గొట్లూరు 11 కేవీ ఫీడర్ స్థానంలో 33 కేవీ లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నందున ఈ అంతరాయం తప్పనిసరి అవుతుందని చెప్పారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.