భారత్‌కు టిక్‌టాక్ రీ ఎంట్రీ.. ప్రభుత్వం క్లారిటీ

భారత్‌లోకి ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ రీఎంట్రీ ఇస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టిక్‌టాక్‌ను అన్‌బ్లాకింగ్ చేసినట్లు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంది. నిషేధం యధావిధిగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. అవి తప్పుడు వార్తలు అని వెల్లడించింది.