'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'
MDK: సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ప్రజలు దూరంగా ఉండి సైబర్ నేరాల వలలో చిక్కకూడదని అల్లాదుర్గం ఎస్సై శంకర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుత.. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల నేరాలు పెరుగుతున్నాయని, అపరిచితులతో పరిచయాలు చేసుకోవద్దన్నారు. అలాగే బహుమతుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను స్వీకరించరాదు అని సూచించారు.