ఆధార్ కిట్స్ అందజేసిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఛాంబర్ నందు శనివారం జిల్లాలోని 26 సచివాలయాలకు 17 రకాల పరికరాలతో కూడిన 26 ఆధార్ కిట్స్‌ను జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ డిజిటల్ అసిస్టెంట్లకు అందజేశారు. అదేవిధంగా జిల్లాలో 508 సచివాలయాలకు వాట్సాప్ మన మిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వ సేవలు అని స్టాండ్స్‌ను సచివాలయం సిబ్బందికి అందజేశారు.