ఎల్ఈడీ స్క్రీన్లలో మ్యాచ్ చూస్తున్న క్రికెట్ ప్రియులు
ATP: మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్షంగా చూసేందుకు MLA దగ్గుపాటి ప్రసాద్ చొరవతో అనంతపురంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. టవర్ క్లాక్, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న జెండా స్తూపం, రాంనగర్‌లోని మైత్రి వనం సర్కిళ్ల వద్ద ఈ తెరలను ఏర్పాటు చేయగా ప్రజలు మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. భారత్ గెలవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.