చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

VZM: సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా విజయనగరం నుంచి వెళ్లే భక్తులకు 15 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 30న ఉదయం 4 గంటల నుండి రాత్రి ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.