బైండోవర్ బాండ్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా
BPT: జిల్లాలో బైండోవర్ బాండ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఐదుగురిని గుర్తించగా.. ఇద్దరికీ 30 రోజులు జైలు శిక్ష, మిగిలిన ముగ్గురికి రూ.2,00,000 చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు ఎస్పీ ఉమా మాహేశ్వర్ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.