ఇచ్చాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

SKLM: ఇచ్చాపురం నియోజకవర్గంలో శనివారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తదితరుల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బి. మణిచంద్ర ప్రకాశ్ రెడ్డి, కూటమి నాయకులు, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి లీలారాణి పాల్గొన్నారు.