కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
NLD: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చాగలమర్రి పట్టణంలో జరిగింది. దూదేకు దస్తగిరి(27) అనే యువకుడు కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.