వాకాడు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

TPT: వాకాడు పోలీస్ స్టేషన్‌ను మంగళవారం గూడూరు డీఎస్పీ గీతాకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్‌లోని పలు రికార్డులు పరిశీలించి కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.