ఎస్సారెస్పీ కెనాల్ వంతెనపై గుంత.. వాహనదారుల ఆందోళన

జగిత్యాల్-కరీంనగర్ రహదారిపై టీఆర్ నగర్ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వంతెనపై ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. ఈ గుంతలో పడి పలువురు వాహనదారులు గాయపడ్డారు. ప్రస్తుతానికి అక్కడ రెండు కర్రలు, ఎర్ర వస్త్రం సూచికగా ఏర్పాటు చేశారు. అధికారులు వెంటనే స్పందించి గుంత పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.