సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

W.G: భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలన్నారు.