'రేపు ఆదరణ పథకంపై అవగాహన సమావేశం'

KDP: సిద్దవటం మండలంలోని బీసీ కులవృత్తులకు ఆదరణ పథకం కింద వృత్తికి అవసరమైన పనిముట్ల కొరకు పలు సలహాలు సూచనలను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ ఫణి రాజకుమారి తెలిపారు. ఈ సమావేశానికి నాయి బ్రాహ్మణులు, రజకులు, వడ్డెర, మత్స్యకారులు చేనేత, స్వర్ణకారులు, కల్లుగీత, తదితర బీసీ కులాలకు చెందిన వారు హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.