పలు అభివృద్ధి పనులుకు శంఖుస్థాపన

SKLM: ఆమదాలవలస శాసన సభ్యులు, కూన రవి కుమార్ గురువారం మెట్టక్కివలస గ్రామంలోని 5, 9, 10, 11 వార్డుల్లో రూ. 60 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రవికుమార్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.