ఫజైరాపై ఇరాన్ మరోసారి దాడి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫజైరా చమురు క్షేత్రంపై ఇరాన్ మళ్లీ డ్రోన్ దాడి చేసింది. అక్కడ ఉన్న చమురు నౌకపై ఈ దాడి జరిగింది. ఇరాన్ నుంచి డ్రోన్, క్షిపణి దాడుల భయంతో కొద్దిసేపు యూఏఈ తన గగనతలాన్ని మూసివేసింది. ఆ తర్వాత విమాన సర్వీసులను కొనసాగించింది. బనీ యాస్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ పాకిస్తాన్ జాతీయుడు మరణించారు. 10 క్షిపణులు, 45 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది.