కేజీబీవీలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
ATP: ఆత్మకూరు మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో రూ. 18.50 లక్షల ఎస్‌ఎస్‌ఏ నిధులతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఆమె శిలాఫలకం ఆవిష్కరించి, విద్యార్థులచే కంప్యూటర్లను ప్రారంభింపజేశారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే పరిటాల సునీత తిలకించారు.