'చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలి'
MDK: చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వాకాటి శ్రీహరి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 20 నాటికి లక్ష్యం మేరకు చేప పిల్లల విడుదల పూర్తి చేయాలని సూచించారు. 83 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను, 26,357 నీటి వనరులలో పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు.