మరుగుదొడ్లుకు రూ.15 వేల సబ్సిడీ: కమిషనర్

మరుగుదొడ్లుకు రూ.15 వేల సబ్సిడీ: కమిషనర్

PLD: స్వంత ఇళ్లు ఉండి వ్యక్తిగత మరుగుదొడ్లు లేని పురపాలక సంఘ పరిధిలోని లబ్ధిదారులకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రూ.15,000 సబ్సిడీ ఇవ్వనుంది. మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు గురువారం ఈ ప్రకటన చేశారు. సబ్సిడీ కోసం అర్హులైన వారు ఈ నెల 12వ తేదీ లోపు వార్డు సచివాలయంలో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.