జిల్లాలో తేలికపాటి వర్షం

జిల్లాలో తేలికపాటి వర్షం

WGL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచే పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఈ అనుకోని వర్షం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పంట కోతల పనులు కొనసాగుతున్న సమయంలో చేన్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసే పరిస్థితి నెలకొంది. దీంతో ధాన్యం నాణ్యత తగ్గి ఆర్థిక నష్టం వాటిల్లుతుందేమోనని రైతులు భయపడుతున్నారు.