పిడుగుపాటుతో రైతు మృతి

పిడుగుపాటుతో రైతు మృతి

TPT: ఎర్రావారిపాళెం మండలం బోడేవాండ్లపల్లిలో శుక్రవారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు కోటకొండ రమణ మధ్యాహ్నం తన పొలం వద్ద పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడి దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. రమణ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.