విద్యుత్ ఛార్జీలపై ఎమ్మెల్యే విరుపాక్షి ఆగ్రహం

KRNL: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా, విద్యుత్ ఛార్జీలను పెంచుతూనే ఉందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మండిపడ్డారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో చార్జీలు పెరగలేదని గుర్తుచేశారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.