లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్
గుంటూరు రైల్వేస్టేషన్ రోడ్డులోని లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ బృందం శనివారం సాయంత్రం దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలపై నిరంతరం దాడులు చేపడుతూనే ఉంటామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.