మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం

PDPL: సింగరేణి RG- 2 ఏరియాలోని OCP 3- CHP, ఏరియా వర్క్షాప్లో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఎస్‌వో 2 GM ఎస్. సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ వినియోగదారుడికి నాణ్యమైన బొగ్గును అందించాలని సూచించారు. ఏరియా వర్క్షాప్లో యంత్రాల విడిభాగాలకు మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి, బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగకుండా చూడాలని తెలిపారు.