భార్యభర్తల గొడవ.. నిండు ప్రాణం బలి
TG: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తండాలో దారణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో.. రవి అనే వ్యక్తి తన భార్య అనితను పారతో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకున్న గ్రామస్థులు పోలీసులు అప్పగించారు.