ప్రభుత్వ విప్‌ను కలిసిన జనసేన నాయకులు

ప్రభుత్వ విప్‌ను కలిసిన జనసేన నాయకులు

CTR: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య సలహాదారులు ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్‌ను శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు కలిశారు. నియోజకవర్గలోని పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే పార్టీ సిద్ధాంతాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని సూచించారు.