8 వార్డులో ముమ్మరంగా జనసేన అభ్యర్థి ప్రచారం

8 వార్డులో ముమ్మరంగా జనసేన అభ్యర్థి ప్రచారం

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డులో జనసేన పార్టీ తరపున, పోటీ చేస్తున్న ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, లక్ష్మి నర్సాగౌడ్ శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే వార్డును, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ నాయకులు పాల్గొన్నారు.