VIDEO: డయాలసిస్ రోగి.. అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
KMR: బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి చనిపోవడంతో కుటుంబీకులు ఆందోళన చేశారు. జుక్కల్ మండలం వజ్రకండి వాసి బీ. మధు (60) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చారు. అయితే అక్కడి సిబ్బంది అతడికి వైద్యం అందించడంలో తాత్సారం చేశారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో అతడి పరిస్థితి విషమించి, ఆసుపత్రి ఆవరణలోనే తుది శ్వాస విడిచారు.