ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ కలకలం
కోనసీమ: పి.గన్నవరం మండలం బెల్లంపూడిలో బుధవారం రాత్రి ఓఎన్జీసీ బావి నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్ అవ్వడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ పల్లవి, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గతంలో మూసివేసిన బావి నుంచి లీకేజీ సంభవించిందని, ప్రజలు భయాందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.