ఇరాన్ దళాలు రాకుండా రోడ్లకు తూట్లు
ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో ఎయిర్ స్ట్రిప్‌పై అమెరికా విమానాలు నేలకు దిగాయి. అటువైపు ఇరాన్ దళాల కాన్వాయ్‌లు రాకుండా చుట్టుపక్కల 20 కిలోమీటర్ల మేరకు రోడ్లకు గుంతలు తవ్వినట్లు తెలుస్తోంది. ఎయిర్‌బస్ శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎట్టకేలకు తమ విమానాలను ధ్వంసం చేసి.. అమెరికా దళాలు వెళ్లిపోయాయి.