మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు
VSP: ఋషికొండలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నగర పోలీస్, VCSC, JCI సహకారంతో మాదకద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ డా. శంఖబత్ర బాగ్చీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ ప్రమాదాలపై వివరించారు. 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈగల్ హెల్ప్‌లైన్ వివరాలు పంచుతూ సమాచారం రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.