అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
KKD: శంఖవరం ICDS ప్రాజెక్టు పరిధిలో ఏర్పడిన అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శిశు అభివృద్ధి పథక అధికారిణి పి. వెంకటలక్ష్మి తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ లోపు శంఖవరం ICDS కార్యాలయంలో అందజేయాలన్నారు.