ప్రిన్సిపల్ కొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయం

NLR :మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో రాత్రి ప్రిన్సిపల్ కొట్టడంతో ఆరో తరగతి విద్యార్థి మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్టడీఅవర్ సమయంలో ప్రిన్సిపల్ కొట్టడంతో విద్యార్థి తలకు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు నవోదయ విద్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.