'జిల్లాలో ఎరువుల కొరత లేదు'
VZM: రబీ పంటల అవసరాలకు జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి రామారావు గురువారం తెలిపారు. ఇప్పటి వరకు 8,058 మెట్రిక్ టన్నులు అందగా, 5,110 టన్నులు రైతులకు విక్రయించారన్నారు. నెలాఖరుకి మరో 2,600 టన్నులు చేరనున్నాయని, ప్రస్తుతం 3,058 టన్నులు RSK, గోదాముల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎరువుల కొరత \ఎక్కడ లేదన్నారు.