'మహాసభలను విజయవంతం చేయాలి'
SRCL: ఈనెల 29, 30న సిరిసిల్ల జిల్లాలో జరిగే సీఐటీయూ (CITU) నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. తంగళ్ళపల్లిలో సీఐటీయూ నాలుగవ మహాసభల కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు పెద్ద ఎత్తున మహాసభలకు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్మికుల కోసం సీఐటీయూ ఎన్నో పోరాటాలు చేస్తుందన్నారు.